Bathukamma kunta: బతుకమ్మకుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునరుద్దరించిన బతుకమ్మ కుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంబర్ పేటలో గత కొన్నేళ్లుగా కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. దాన్ని సర్వాంగ సుందరంగా పునరుద్దరించింది. అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మకుంటను ప్రారంభించారు.

Bathukamma kunta: బతుకమ్మకుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bathukamma Kunta

Updated on: Sep 28, 2025 | 7:37 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునరుద్దరించిన బతుకమ్మ కుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతో బతుకమ్మకుంటా మళ్లీ తిరిగి ప్రాణం పోసుకుంది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మకుంటను ప్రారంభించారు. నిజానికి ఈ నెల 26నే బతుకమ్మకుంటను ప్రారంభించాల్సి ఉండగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా దాన్ని వాయిదా వేశారు.

గత కొన్ని ఏళ్లుగా సగానికిపైగా బతుకమ్మ కుంటను కబ్జా కోరులు ఆక్రమించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన హైడ్రా.. చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన బతుకమ్మకుంటను సైతం స్వాధీనం చేసుకున్న హైడ్రా.. ప్రభుత్వ ఆదేశంతో 7కోట్ల40 లక్షల రూపాయలతో బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా మొత్తం 5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్​గార్డెన్ ప్రభుత్వం​ఏర్పాటు చేసింది. గత కొన్నేళ్లుగా ఎందుకు పనికి రాకుండా ఉన్న ఈ బతుకమ్మకుంట చెరువు ప్రస్తుతం హైడ్రా పునుద్దరణ తర్వాత జనాలను ఆకర్షిస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.