తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట రాంపూర్ పంప్‌హౌస్ పనులను పరిశీలించనున్న ఆయన.. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజ్ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఉదయం ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చేరుకోనున్నారు.