Governor Tamilisai : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

|

Jun 02, 2021 | 4:52 PM

గవర్నర్ ను కలిసిన కేసీఆర్.. ఈరోజు తమిళిసై పుట్టినరోజు కూడా కావడంతో ఆమెకు పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు..

Governor Tamilisai  : తెలంగాణ గవర్నర్‌  తమిళిసై సౌందరరాజన్ కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
Tamilisai
Follow us on

CM KCR conveys birthday greetings to Tamilisai : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ ను కలిసిన కేసీఆర్.. ఈరోజు తమిళిసై పుట్టినరోజు కూడా కావడంతో ఆమెకు పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై గవర్నర్ – సీఎం చర్చించారు. కరోనా కట్టడి, వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేసీఆర్ గవర్నర్ కు తెలియజేశారు. కాగా, ఉదయమే గవర్నర్ తమిళసై రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇవాళ రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తమిళసై జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.

ఈ వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలా ఉండగా, తమిళసై సౌందరరాజన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా ఆనేక మంది ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read also : Sonu Sood : ‘నేను కాదు.. సోనూసూద్ సూపర్ హీరో’.. అతనికి థ్యాంక్స్ చెప్పమన్న కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ