
వైద్య వృత్తిలో కొనసాగుతున్నారుగా.. అని ఎవ్వరికి అనుమానం రాలేదు.. వాళ్ల దగ్గరకు వచ్చే పేషెంట్స్, చుట్టుపక్కల వారికి చిట్టీలు వేస్తున్నామని పరిచయమయ్యారు.. అధిక వడ్డీ వస్తుందని, ఒకేసారి చిట్టిల డబ్బులు తీసుకోవచ్చంటూ అందరినీ.. నమ్మించారు.. ఇలా లక్షలు వసూలు చేసి.. కొట్లు పోగేశారు. ఆ తర్వాత కిలాడీ లేడి జంట ఒక్కసారిగా అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ జంట చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రేష్మ, అలీ అనే దంపతులు.. నిజాంపేట బండారీ లేఅవుట్‌లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్నారు.. అయితే.. చిట్టీల పేరుతో 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ.15 కోట్ల మేర వసూలు చేశారు.. ఒక్కొక్కరి నుంచి 50, 10 లక్షలు వసూలు చేశారు. అయితే.. ఇటీవల చిట్టీల కాలం పూర్తయినప్పటికీ, డబ్బులు ఇవ్వడం లేదు.. దీంతో బాధితులు రోజూ వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు..
ఈ క్రమంలోనే.. అనుమానంతో బాధితులు క్లినిక్ వెళ్లి చూడగా.. దంపతులు అప్పటికే అదృశ్యమయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన 42 మంది బాధితులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. రేష్మ, అలీ దాదాపుగా.. బాధితుల నుంచి సుమారుగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని.. అధిక లాభాల పేరుతో ప్రజలను మోసం చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా.. పెద్దమొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరగడంతో ఈ కేసును EOWకు బదిలీ చేయనున్న బాచుపల్లి పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..