Hyderabad City Police: బయట బోరున వర్షం.. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పలు.. పోలీసులు ఏం చేశారంటే..

|

Sep 27, 2021 | 6:13 PM

పోలీసులు అంటే కఠినంగా ఉంటారని.. భయపెడతారని అనుకుంటారు. ఎదుకంటే వారి డ్యూటీ అలా ఉంటుంది మరి....

Hyderabad City Police: బయట బోరున వర్షం.. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పలు.. పోలీసులు ఏం చేశారంటే..
Hyde Police
Follow us on

పోలీసులు అంటే కఠినంగా ఉంటారని.. భయపెడతారని అనుకుంటారు. ఎదుకంటే వారి డ్యూటీ అలా ఉంటుంది మరి. కానీ వారికి కూడా దయ, ప్రేమ ఉంటుంది. ఎదుటి వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని ఉంటుంది. పక్కవారు ఆపదలో ఉంటే కాపాడలని ఉంటుంది. మొన్నఓ కానిస్టేబుల్ అంబులెన్స్‎కు దారి ఇవ్వడం కోసం కాళ్లకు చెప్పులు లేకండా పరుగెత్తాడు. ట్రాఫిక్ నుంచి అంబులెన్స్  పంపించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఓ మహిళకు పురిటి నొప్పలు వచ్చి ఆస్పత్రికి వెళ్లాలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమెకు రక్షకభటులే అండగా నిలిచారు. అన్నదమ్ముల్ల ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

హైదరాబాద్ చిలకలగూడకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బయటకు వచ్చే చూస్తే భారీ వర్షం కురుస్తోంది. ఏ ఒక్క వాహనం కూడా రోడ్డుపై లేదు. మరోవైపు ఆమెకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఎలా దేవుడా అనుకుంటున్న సమయంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్‎కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు కిరణ్, ఇమ్రాన్ ప్రెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా అటు వైపు వెళ్లారు. మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుందన్న విషయం తెలుసుకుని ఆమెను పోలీసుల వాహనంలో సికిద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించిన కానిస్టేబుళ్లు కిరణ్, ఇమ్రాన్ ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. వారు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లే దృశ్యాలను ట్వీట్టర్‎లో పోస్టు చేశారు.

 

Read also: Cyclone: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్