Car Fire : వెళ్తోన్న కారు వెనుక మంటలు, అలర్ట్ చేసిన వాహనదారులు, దంపతులకు తప్పినముప్పు, పత్తాలేని ఫైర్ సిబ్బంది.!

Car Fire : రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక ఫ్యామిలీ కారులో వెళ్తోంది. ట్యాంక్ బండ్ సమీపంలోని బోట్స్ క్లబ్ దగ్గరకి వచ్చేసరికి ఉన్నఫలంగా కారు వెనుక మంటలు..

Car Fire : వెళ్తోన్న కారు వెనుక మంటలు, అలర్ట్ చేసిన వాహనదారులు, దంపతులకు తప్పినముప్పు, పత్తాలేని ఫైర్ సిబ్బంది.!

Updated on: Mar 27, 2021 | 3:02 PM

Car Fire : రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక ఫ్యామిలీ కారులో వెళ్తోంది. ట్యాంక్ బండ్ సమీపంలోని బోట్స్ క్లబ్ దగ్గరకి వచ్చేసరికి ఉన్నఫలంగా కారు వెనుక మంటలు చెలరేగాయి. కారు వెనుక భాగంలో మంటలు గమనించిన అటుగా వస్తున్న వాహనదారులు సమాచారం ఇవ్వడంతో కారులో ప్రయాణిస్తున్న భార్య, భర్త కారులోంచి హుటాహుటీన దిగిపోయారు. అదృష్టవశాత్తూ దంపతులు కారులోంచి దిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు కారు అంతా చెలరేగాయి. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

అయితే, కారు మంటల్లో కాలిపోతుందని ఫోన్ చేసినా ఫైర్ సిబ్బంది ఎవరూ స్పందించలేదని సదరు దంపతులు ఆరోపించారు. ఈ ప్రమాదం గాంధీనగర్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్‌పేట పీఎస్ సరిహద్దులో జరిగిందని, ఆ ప్రాంతం తమది కాదంటే, తమది కాదని పోలీసులు చెప్పుకొచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు అక్కడి నుంచి ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయారు.

Read also : Modi in Bangladesh : ముజిబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల్లో మోదీ, భారత్ – బంగ్లా ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలని పిలుపు