విశాఖపట్నం: భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా ఖరగ్‌పుర్ డివిజన్‌లో రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ వాల్తేరు సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి మంగళవారం (జూన్ 20) ప్రకటన వెలువరించారు. ఈ నేపథ్యంలో సుమారు 11 రైళ్ల సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా గత కొంత కాలంగా పలు రైళ్వే డివిజన్లలో జరుగుతున్న పనుల నిమిత్తం ఆయా రోజుల్లో రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో ఏయే రోజున ఏయే రైళ్లు రద్దుకానున్నాయో ఆ వివరాలు మీకోసం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.