స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మండలి నుంచి తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్..

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ సెషన్ మొత్తం మండలి నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందు అసెంబ్లీలో కాంగ్రెస్‌, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో తీర్మానం చేసి మండలి చైర్మన్‌కు పంపించారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మండలి నుంచి తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్..
Telangana Council Suspends Brs Mlcs Tatha Madhu, Naveen Reddy

Updated on: Sep 08, 2026 | 6:11 PM

స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.. ఈ తరుణంలో తెలంగాణ మండలి నుంచి తాతా మధు, నవీన్‌ ను సస్పెన్షన్ చేస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మండలి నుంచి తాతా మధు, నవీన్‌ ను సస్పెన్షన్‌ చేశారు.. ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు.

అయితే, అరెస్టు అనంతరం.. కోర్టు బెయిల్ ఇవ్వడంతో MLCలు తాతా మధు, నవీన్‌రెడ్డి సాయంత్రం మండలికి వచ్చారు. ఇద్దరూ సభలోకి రావడంపై మహేష్‌ గౌడ్‌ మండిపడ్డారు. వెంటనే ఇద్దరినీ సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తాతా మధు, నవీన్‌రెడ్డిని ఈ సెషన్‌ మొత్తానికి సస్పెండ్ చేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు, స్పీకర్‌పై ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌, CPI, MIM MLAలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి.. మండలి చైర్మన్‌కు పంపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us