Bosch in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ప్రఖ్యాత జర్మన్ మల్టీ నేషనల్ కంపెనీ (German MNC) బాష్ హైదరాబాద్ (Hyderabad)నగరంలో బాష్ (Bosch) గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఆర్ అండ్ డి ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విట్టర్‌లో స్వయంగా తెలియజేశారు. తాజా ప్రతిపాదనతో దాదాపు 3000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. జర్మన్ ఎమ్‌ఎన్‌సీ కంపెనీ అయిన మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ హోమ్ అప్లియాన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా పేరుగాంచింది. ఈ అంతర్జాతీయ సంస్థ బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అండ్ ఆర్, డీని హైదరాబాద్‌ను స్టార్టజిక్ లొకేషన్ గా ఎంచుకుంది. తాజా నిర్ణయంతో త్వరలో హైదరాబాద్ లో బోష్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
BOSCH in Hyderabad! ?
German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd
— KTR (@KTRTRS) February 8, 2022
Also Read: