Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

|

Jul 09, 2023 | 6:45 AM

మహా నగరంలో లష్కర్‌ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా...

Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని
Bonalu
Follow us on

మహా నగరంలో లష్కర్‌ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆదివారం తెల్లవారు జామునుంచి లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించనున్నారు.

భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. ఇక మోండా మార్కెట్‌ దగ్గర ఉదయం 9.30 గంటలకి నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు.

భక్తులు భారీ ఎత్తున హాజరవుతోన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు గాను మహంకాళి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూంని.. పోలీసు కామాండ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. సుమారు 5లక్షల మంది బోనాలు సమర్పించనున్నట్లు ప్రభుత్వం అంచనావేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..