Telangana: కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తా.. సీఎం పై ఈటల రాజేందర్ మరోసారి ఫైర్

|

Jul 25, 2022 | 6:15 PM

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఓడిపోవడం...

Telangana: కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తా.. సీఎం పై ఈటల రాజేందర్ మరోసారి ఫైర్
Etela Rajender
Follow us on

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘పల్లె గోస- బీజేపీ భరోసా’ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల.. ఈ కామెంట్స్ చేశారు. అప్పంపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని, ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో (BJP) చేరినా ఆహ్వానిస్తామని వెల్లడించారు. హుజూరాబాద్‌ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ దుర్మార్గాలు, కుట్రలు, అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. గతంలోనూ ఈటల రాజేందర్ ఇలాంటి కామెంట్సే చేశారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రగతి భవన్ కు తీసుకొచ్చామన్నారు. తన రాజకీయ జీవితంలో పరుష పదజాలాలు ఏనాడు వాడలేదని, తన గురించి సీఎం కేసీఆర్ దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ధనవంతులకు రైతుభందు ఎందుకని తాను ప్రశ్నించానని, ఈ విషయాన్ని ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు. ప్రతీదాన్ని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారన్నారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్భంగా ఉన్నారన్న ఈటల.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. ఎన్నికలకు సిద్ధం కావడానికి ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించాను. కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారి అడుగుజాడల్లో నడుస్తున్నాను. పేదల అసైన్డ్ భూములను కాపాడేందుకు బీజేపీ అండగా ఉంటుంది. దళిత సంఘాలు ఏకతాటిపైకి వచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉద్యమించాలి. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. బీజేపీ అధికారంలోకి సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం.

ఇవి కూడా చదవండి

    – ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే  

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..