బంక్ ఓనర్.. ప్లాంట్ ఓనర్.. ఒక్కరే.. ఇది మామూలు దందా కాదుగా.. గుజరాత్‌ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించి..

|

Jul 21, 2024 | 9:27 AM

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో అక్రమంగా బయోడీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు అధికారులు. నందిగామ మండల కేంద్రంలోని హైవేపై రెండు ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తుండగా ను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. విశ్వాసనీయ సమాచారంతో

బంక్ ఓనర్.. ప్లాంట్ ఓనర్.. ఒక్కరే.. ఇది మామూలు దందా కాదుగా.. గుజరాత్‌ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించి..
Bio Diesel Plant Seized
Follow us on

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో అక్రమంగా బయోడీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు అధికారులు. నందిగామ మండల కేంద్రంలోని హైవేపై రెండు ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తుండగా ను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. విశ్వాసనీయ సమాచారంతో 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు సివిల్ సప్లై అధికారులు. దీనిపై తర్వాత విస్తృత తనిఖీలు చేశారు. నందిగామ బైపాస్ కు దగ్గర్లోని ఓ గోదాంలో అనుమతులు లేకుండా గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించి కెమికల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అక్రమంగా వివిధ బంకులకు, పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నారని కనుగొన్నారు అధికారులు. నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ కు చెందిన JS ఫ్యూయిల్ బంక్ లో తనిఖీలు చేశారు. JS ఫుయల్స్ ఓనర్, అక్రమంగా బయో డీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కరేనని అధికారుల విచారణ తేలింది. దీంతో నిల్వ ఉంచిన గోదాంను సీజ్ చేశారు.

వీడియో చూడండి..


12వేల లీటర్లతో ఉన్న రెండు డీజిల్ టాంకర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీజీల్ ట్యాంకర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. జేఎస్ ఫ్యూయిల్ బంక్ ఓనర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ దందాలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అధికారులు. కేసును లోతుగా ఎంక్వైరీ చేసి.. విచారణ చేస్తామని చెప్పారు. బయోడీజల్ పేరిట చేస్తున్న మోసాలను పసిగట్టాలని అధికారులు సూచించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా ఎదురైతే తమకు తెలియజేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..