Accident: హైదరాబాద్‌ ఎంజిబిఎస్‌ బస్‌స్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్‌ డెడ్‌..

Bike Accident At MGBS Hyderabad Two Young Dies: హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వేడుకకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి ఇంటికి వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది...

Accident: హైదరాబాద్‌ ఎంజిబిఎస్‌ బస్‌స్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్‌ డెడ్‌..

Updated on: Feb 15, 2021 | 6:35 AM

Bike Accident At MGBS Hyderabad Two Young Dies: హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వేడుకకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి ఇంటికి వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించారు.
వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట ముసానగర్‌కు చెందని ఫసి ఖాన్‌, మోసిన్‌లు ఆదివారం ఓ ఫంక్షన్‌కు హాజరై బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. తీరా ఎంజిబిఎస్‌ బస్‌స్టాండ్‌ వద్దకు చేరుకున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఓ గుంతలో పడ్డారు. ఇద్దరు యువకులపై నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఎక్కడంతో వారిద్దరు అక్కడిక్కడే మరణించారు. వెంటనే మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల ఉస్మానియాకు చేరుకుని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read: Fire Accident: భువనగిరి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని కీలలు..