బీసీ గర్జన బీజేపీలో భరోసా నింపేనా.? డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నెరవేరేనా?

|

Nov 07, 2023 | 6:59 PM

అహంకారం ఎవరినైనా సర్వనాశనం చేస్తుందని , బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు మోదీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే ఈ అహంకారానికి ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లిక్కర్‌ స్కాంలో అవినీతికి పాల్పడ్డ వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీటీమ్‌ అన్న కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టారు మోదీ.

అహంకారం ఎవరినైనా సర్వనాశనం చేస్తుందని , బీఆర్‌ఎస్‌ నేతలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు మోదీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే ఈ అహంకారానికి ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. లిక్కర్‌ స్కాంలో అవినీతికి పాల్పడ్డ వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీటీమ్‌ అన్న కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టారు మోదీ. తాము కాదు బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ సీ టీమ్‌గా మారిందని కౌంటర్‌ ఇచ్చారు. ఎల్బీ స్టేడియం లోనే తాను దేశ ప్రధాని అవుతారని ప్రజలు అప్పట్లో ప్రకటించారని, తెలంగాణకు తొలి బీసీ సీఎంను కూడా బీజేపీ నుంచి ఇదే స్టేడియం నుంచి అందిస్తామని సంచలన ప్రకటన చేశారు మోదీ. తెలంగాణలో మార్పు స్పష్టంగా కనబడుతోందని , బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమన్నారు మోదీ. బీజేపీ తప్పకుండా అధికారం లోకి వస్తుందన్నారు.