Hyderabad Water Supply: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply: నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు. అయితే పనులు పూర్తైన అనంతరం పైప్‌లైన్‌ను పునరుద్ధరించి, దశలవారీగా నీటి సరఫరా పునఃప్రారంభించనున్నట్లు జలమండలి వెల్లడించింది. అయితే ముందు జాగ్రత్తగా ఉండేందుకు ముందస్తుగా..

Hyderabad Water Supply: హైదరాబాద్‌ నగర వాసులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం
Hyderabad Water Supply

Updated on: Jul 25, 2026 | 7:26 PM

Hyderabad Water Supply: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఆధ్వర్యంలో ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) పనులను వేగవంతం చేయడానికి, కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-2 రింగ్ మెయిన్-2కు చెందిన 1600 మి.మీ వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ పరిధిలో జంక్షన్ పనులు చేపడుతోంది.

ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ హైవే వైపు రహదారి ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి, ఫ్లైఓవర్ P15 ఫౌండేషన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ పనులు అత్యవసరంగా చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో జూలై 27వ తేదీన ఉదయం 10.00 గంటల నుంచి జూలై 28వ తేదీ ఉదయం 10.00 గంటల వరకు కేడబ్ల్యూఎస్‌పీ ఫేజ్-2 రింగ్ మెయిన్-2పై 24 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి తెలిపింది.

ఇవి కూడా చదవండి

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

ఫతేనగర్, హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకటరెడ్డి నగర్, ఉప్పల్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికంగా), పద్మారావు నగర్, బన్సీలాల్‌పేట్,,బౌద్ధనగర్, తార్నాక (పాక్షికంగా), సీతాఫల్‌మండి, మెట్టుగూడ, లాలాపేట్ (పాక్షికంగా), నార్త్ లాలాగూడ, అడ్డగుట్ట, బాలానగర్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు. అయితే పనులు పూర్తైన అనంతరం పైప్‌లైన్‌ను పునరుద్ధరించి, దశలవారీగా నీటి సరఫరా పునఃప్రారంభించనున్నట్లు జలమండలి వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us