ప్రయాణికులకు షాక్.. బేగంపేట మెట్రోస్టేషన్ మూసివేత

హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌‌కు తాళాలు పడ్డాయి. భద్రతా కారణాల వల్ల ఇవాళ బేగం పేట మెట్రో స్టేషన్‌ను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బేగంపేటలో మెట్రో రైలు ఆగదని తెలియజేస్తూ.. అన్ని మెట్రోస్టేషన్లతో ఈ సమాచారాన్ని అందించారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా నోటీసులు అంటించారు. దీంతో అక్కడకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఒకవైపు బస్సులు లేక.. మరోవైపు మెట్రో కూడా ఆ స్టేషన్‌లో ఆగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బేగంపేటలోని ప్రశాంత్ […]

ప్రయాణికులకు షాక్.. బేగంపేట మెట్రోస్టేషన్ మూసివేత
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 12:09 PM

హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌‌కు తాళాలు పడ్డాయి. భద్రతా కారణాల వల్ల ఇవాళ బేగం పేట మెట్రో స్టేషన్‌ను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బేగంపేటలో మెట్రో రైలు ఆగదని తెలియజేస్తూ.. అన్ని మెట్రోస్టేషన్లతో ఈ సమాచారాన్ని అందించారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా నోటీసులు అంటించారు. దీంతో అక్కడకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఒకవైపు బస్సులు లేక.. మరోవైపు మెట్రో కూడా ఆ స్టేషన్‌లో ఆగకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బేగంపేటలోని ప్రశాంత్ నగర్, పోలీస్ లైన్ బస్టాపులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో.. బేగంపేట సోమాజిగూడ సర్కిల్ సహా తదితర ప్రాంతాల్లో బందోబస్తును పెంచేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Latest Articles