
హైదరాబాద్ మెడలో మరో మణిహారాన్ని బైరామల్ గూడ ఫ్లైఓవర్‌తో అలంకరించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ 780 మీటర్ల పొడవుగా విస్తరించి ఉందని చెబుతున్నారు అధికారులు. దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్‌లో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్, ఎల్ బి నగర్ పరిధిలో నిర్మించేందుకు చేపట్టిన ప్రణాళికల్లో ఒకటి. మొత్తం 14 నిర్మాణాలలో ఈ ఫ్లైఓవర్ ఆరవది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులతో పాటు ఇతర వ్యయాలు కలుపుకొని రూ. 448 కోట్లతో చేపట్టారు. హైదరాబాద్ రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని, సీనరీలను చూసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ ఫ్లైఓవర్ 780 మీటర్ల పొడవును కలిగి ఉంది.
భారతదేశంలోనే మొట్టమొదటి ప్రీకాస్ట్ అండ్ పోస్ట్-టెన్షన్డ్ టెక్నాలజీ తో నిర్మించిన గొప్పకట్టడంగా చెబుతున్నారు అధికారులు. ఈ వినూత్న నిర్మాణంలో అనేక అధునాతనమైన సాంకేతికతలను ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ సికింద్రాబాద్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్యలను గణనీయంగా తగ్గించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. బైరామల్ గూడ జంక్షన్ వద్ద 95%, సాగర్ రోడ్ జంక్షన్ వద్ద 43% ట్రాఫిక్ సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది. దీని నిర్మాణ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఫ్లైఓవర్ నిర్మించే క్రమంలో ఒకచోట సమస్య తలెత్తి కూలిపోయి కార్మికులకు స్వల్ప గాయాలైనప్పటికీ విజయవంతంగా పూర్తిస్థాయిలో నిర్మించారు. ఈ కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న పట్టణాల జాబితాలో సుస్థిరమైన చోటు సంపాధించుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..