బిల్డింగ్‌పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

| Edited By: Anil kumar poka

Mar 30, 2019 | 6:30 PM

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బీటెక్ చదువుతున్న సుస్మిత అనే విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘట్ కేసర్ ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సుస్మిత.. చిక్కడపల్లి సమీపంలోని బృందావన్ కాలనీలో ఉంటోంది. ఫీజు కట్టాలని సుస్మితకు కాలేజ్ యాజమాన్యం ఈనెల 23న మెసేజ్ పంపించారు. ఐతే.. ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో లేనని.. చెన్నైలో ఉన్నానని రెండ్రోజుల్లో ఫీజు కట్టేస్తానని సుస్మిత తిరిగి […]

బిల్డింగ్‌పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Follow us on

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బీటెక్ చదువుతున్న సుస్మిత అనే విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘట్ కేసర్ ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సుస్మిత.. చిక్కడపల్లి సమీపంలోని బృందావన్ కాలనీలో ఉంటోంది. ఫీజు కట్టాలని సుస్మితకు కాలేజ్ యాజమాన్యం ఈనెల 23న మెసేజ్ పంపించారు. ఐతే.. ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో లేనని.. చెన్నైలో ఉన్నానని రెండ్రోజుల్లో ఫీజు కట్టేస్తానని సుస్మిత తిరిగి మెసేజ్ పెట్టింది. అయితే.. చెన్నై నుంచి తిరిగివచ్చిన తరువాత ఆమె ఫీజు సంగతి మరచిపోయింది.

కాగా.. కాలేజ్ యాజమాన్యం నుంచి ఫీజ్ విషయమై సుస్మిత తండ్రికి ఫోన్ వచ్చింది. ఫీజు కట్టాలనే సంగతి తనకు తెలియదని, సుస్మిత కూడా తమకు ఈ విషయం చెప్పలేదని.. తండ్రి కాలేజ్ యాజమాన్యంతో చెప్పారు. అయితే.. ఇంతలోపే ఏం జరిగిందో.. ఏమో తెలియదు కానీ.. సుస్మిత బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఫీజు విషయమై తండ్రి మందలిస్తాడనే భయంతోనే సుస్మిత ఆత్మహత్య చేసుకుందని అందరూ భావిస్తున్నారు. అయితే.. ఫీజు కారణంగా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మృతురాలి బంధువులు చెప్తున్నారు. సుస్మిత చాలా సెన్సిటివ్ అని, ఫీజు గురించి ఆమెను ఏమీ అనలేదని ఆమె తండ్రి అంటున్నారు.