Hyderabad: రాత్రి పూట ట్రాఫిక్ సిగ్నలింగ్ సమయం ఎంతో తెల్సా..?

| Edited By: Ram Naramaneni

Jul 27, 2023 | 9:06 AM

పగటి పూట అన్ని సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉండి.. వాహనాల రాకపోకలు స్మూత్‌గా జరిగేలా చూస్తారు. రాత్రి పూట మాత్రం ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడతారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.

Hyderabad: రాత్రి పూట ట్రాఫిక్ సిగ్నలింగ్ సమయం ఎంతో తెల్సా..?
Hyderabad Traffic Signal
Follow us on

హైదరాబాద్, జులై 27:  డే టైంలోనే కాదు నైట్ టైమ్‌లో కూడా ట్రాఫిక్‌తో నరకం అనుభవిస్తున్నారు నగర వాసులు. అదేంటి నైట్ టైంలో ట్రాఫిక్ ఏంటని ఆలోచిస్తున్నారా… మీరు చదవింది నిజమే. అర్ధరాత్రి ట్రాఫిక్ ఇప్పుడు హైదరాబాదీలకు పెద్ద సమస్యగా మారింది.  పగటి పూట ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్న పోలీసులు.. రాత్రుల్లో మాత్రం ఆటో మేటెడ్ సిగ్నలింగ్ వ్యవస్థపై ఆదరపడుతున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో మేటెడ్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్ద వల్ల రాత్రి సమయాల్లో అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ సిస్టం సక్రమంగా కొనసాగుతున్నపటికీ రాత్రి సమయంలో మాత్రం ఆశించిన ఫలితం ఉండటం లేదు. ఆటో మేటెడ్ ట్రాఫిక్ సిగ్నలింగ్ కి సమయం కేవలం పది సెకన్లు మాత్రమే ఉండటం.. ఈ పది సెకన్లలో కేవలం ఐదు ఆరు వాహనాలు మాత్రమే ముందుకు వెళ్తాయి. దీంతో వెనుక ఉన్న వాహనాలు చాలా స్పీడ్‌గా వచ్చి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆ వెనక నుంచి వాహనాలు ఆగి ఉన్న ముందు వాహనాన్ని ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పలు సందర్భాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు దీనికి నిదర్శనం. రాత్రి వేళల్లో ఆటో మేటిక్ సిగ్నలింగ్ పరిధి మరింత పెంచాలని సగటు వహనదారుడు డిమాండ్ చేస్తున్నాడు. పది సెకనంల పరిధిని కనీసం 20 నుండి 30 సెకన్లకు పెంచాలని ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం సాయంత్రం మాదిరి ఆగే సిగ్నలింగ్ సమయం కంటే కాస్త తక్కువగా రాత్రి పడే సిగ్నళ్ల సమయం ఉండాలని సగటు వాహనదారుడి అభిప్రాయం. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.