Secunderabad : డెక్కన్ మాల్‌ కూల్చివేతకు అధికారుల గ్రీన్‌సిగ్నల్.. బిల్డింగ్‌లో లభించని మృతదేహాల ఆనవాళ్లు

|

Jan 22, 2023 | 2:31 PM

ఎట్టకేలకు సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌లోకి ప్రవేశించారు DRF సిబ్బంది. లోపల డెడ్‌బాడీస్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించకపోతే..బిల్డింగ్‌ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Secunderabad : డెక్కన్ మాల్‌ కూల్చివేతకు అధికారుల గ్రీన్‌సిగ్నల్.. బిల్డింగ్‌లో లభించని మృతదేహాల ఆనవాళ్లు
Deccan Knitwear Building
Follow us on

సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌లో అగ్నిప్రమాదం తర్వాత.. ఆదివారం ఫస్ట్‌ టైమ్ లోపలికి ప్రవేశించారు DRF, ఫైర్‌ సిబ్బంది. ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి అన్ని ఫ్లోర్లనూ క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాల ఆనవాళ్ల కోసం గాలించారు. కానీ డెడ్‌బాడీస్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. శనివారం డ్రోన్‌ ద్వారా మృతదేహాల ఆనవాళ్ల కోసం ప్రయత్నించినా..ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక డెడ్‌బాడీ మాత్రమే కనిపించింది. అక్కడే శిథిలాల కింద మిగిలిన మృతదేహాల ఆనవాళ్లు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు ఫైర్‌ సిబ్బంది.

ఐతే DRF ఫైర్‌ సిబ్బంది బిల్డింగ్‌ అంతా గాలించినా..మృతదేహాల ఆనవాళ్లు లభించకపోవడంతో..ఇక కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించనున్నారు. కూల్చివేతకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతి ఇచ్చింది. మృతదేహాల ఆనవాళ్లు లభించకపోవడంతో.. కూల్చివేతకు అనుమతి ఇచ్చారు. మరోవైపు కూల్చివేతలు చేపట్టే మాలిక్‌ ఏజెన్సీ ప్రతినిధులు కూడా బిల్డింగ్‌ను పరిశీలించారు. శిథిలాలు చుట్టపక్కల ఇళ్లపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించారు. చుట్టుపక్కల ఇళ్లకు డ్యామేజ్ కాకుండా కూల్చివేతకు చర్యలు చేపట్టారు. కాంబి కటింగ్ మెషీన్‌తో వ్యర్ధాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐరన్ స్లాబ్ గోడల వ్యర్ధాలను కూడా ఇదే యంత్రంతో తొలగించేలా చర్యలు చేపట్టారు అధికారులు. భవనం ముందు భాగంలోని పై ఫ్లోర్ నుంచి కూల్చివేతకు ప్లాన్ రూపొందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..