Hyderabad: ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదని దాడికి పాల్పడ్డారు.. అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆఖరుకు

|

Jun 21, 2022 | 4:30 PM

హైదరాబాద్( Hyderabad) నగరంలో నేర ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతోంది. సంచలనంగా మారిన జూబ్లీహిల్స్(Jubilee Hills) సామూహిక అత్యాచార ఘటన మరవకముందే మరో ఘటన జరగడం సంచలనంగా మారింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టార్...

Hyderabad: ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదని దాడికి పాల్పడ్డారు.. అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆఖరుకు
Harassment
Follow us on

హైదరాబాద్( Hyderabad) నగరంలో నేర ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతోంది. సంచలనంగా మారిన జూబ్లీహిల్స్(Jubilee Hills) సామూహిక అత్యాచార ఘటన మరవకముందే మరో ఘటన జరగడం సంచలనంగా మారింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టార్ హోటల్ పబ్ లో యువతి పై కొందరు యువకులు దాడి చేశారు. న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషన్ గా పని చేస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ పబ్ లాంజ్ లో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్ళిన యువతితో 8 మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆపేందుకు ప్రయత్నించిన స్నేహితురాళ్లపై బాటిల్స్ తో విచక్షణ రహితంగా దాడి చేశారు. పబ్ లో ఉన్న సమయంలో బాధితురాలి దగరికి వచ్చి ఫోన్ నంబర్ అడిగగా ఇచ్చేందుకు యువతి నిరాకరించింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన యువకులు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర ఆవేదన చెంది రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా.. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. విచారణ వేగవంతం చేయడంతో పాటు మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. జూబ్లిహిల్స్ లోని పబ్‌లో పరిచయమైన బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఓ ప్రభుత్వ సంస్థకు ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి