AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వ‌న‌స్థలిపురం ఏసీబీ రైడ్స్.. రూ. 70వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన స‌బ్ రిజిస్ట్రార్!

సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్‌ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి..

Hyderabad: వ‌న‌స్థలిపురం ఏసీబీ రైడ్స్.. రూ. 70వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన స‌బ్ రిజిస్ట్రార్!
Vanasthalipuram Sub Registrar
Srilakshmi C
|

Updated on: Aug 22, 2025 | 5:47 PM

Share

హైద‌రాబాద్, ఆగస్ట్‌ 22: అవినీతికి అలవాటు పడిన గుంటనక్కలు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేశాయి. సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్‌ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి జలగలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో స‌బ్ రిజిస్ట్రార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని వ‌న‌స్థలిపురం స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో శుక్రవారం (ఆగస్ట్‌ 22) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

వ‌న‌స్థలిపురం స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో స‌బ్ రిజిస్ట్రార్‌గా రాజేశ్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఓ ఆస్తి రిజిస్ట్రేష‌న్ విష‌యంలో రాజేశ్‌ డ‌బ్బులు డిమాండ్ చేశాడు. సంతకం కావాలంటే రూ.లక్ష కట్టాల్సిందేనంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేదిలేక బాధితుడు తొలి విడత రూ. 70 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స‌బ్ రిజిస్ట్రార్‌గా రాజేశ్ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏపీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేశ్‌తో పాటు అదే కార్యాలయంలోని డాక్యుమెంట్ రైట‌ర్‌గా ఉన్న ర‌మేశ్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆస్తి రిజిస్ట్రేష‌న్ విష‌యంలో ఓ వ్యక్తి నుంచి రూ. ల‌క్ష లంచం డిమాండ్ చేసిన స‌బ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ ఈ రోజు రూ. 70 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా ప‌ట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 2 గంటల పాటు సోదాలు చేశారు. గమనించిన ఇతర డాక్యుమెంట్ రైట‌ర్లు తమ షాపులకు తాళాలు వేసుకొని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అన్ని ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్