Hyderabad: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. తల్లీబిడ్డలు క్షేమం..ఎక్కడంటే..

|

Oct 28, 2021 | 8:43 AM

సాధారణంగా గర్భిణులు ఒకసారి ఒక బిడ్డకే జన్మిస్తుంటారు. మరికొందరు కవలలను ప్రసవిస్తుంటారు. ఇంకొందరు

Hyderabad: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. తల్లీబిడ్డలు క్షేమం..ఎక్కడంటే..
Follow us on

సాధారణంగా గర్భిణులు ఒకసారి ఒక బిడ్డకే జన్మిస్తుంటారు. మరికొందరు కవలలను ప్రసవిస్తుంటారు. ఇంకొందరు అరుదుగా ముగ్గురు బిడ్డలకు జన్మనిస్తుంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలను ప్రసవించింది. మెహదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. పాతబస్తీలోని హఫీజ్‌ బాబా నగర్‌కు చెందిన అఫ్రీన్‌కు ముగ్గురు ఆడ, ఒక మగ శిశువులు జన్మించినట్లు…తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మగ బిడ్డ 1500 గ్రాములు, ఆడ బిడ్డలు 1500, 1400, 1300 గ్రాములు ఉన్నట్లు వారు వివరించారు.
మూడు గంటల పాటు శ్రమించి…
అఫ్రీన్‌కు ఇది మూడో కాన్పు. పైగా ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. అయినా వైద్యుల బృందం విజయవంతంగా సిజేరియన్‌ శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు సుఖ ప్రసవమయ్యేలా చేసింది. ‘ మా ఆస్పత్రిలో ఇప్పటివరకు సుమారు 10వేలకు పైగా ప్రసవాలు జరిగాయి. అయితే ఒకే కాన్పులో నలుగురు జన్మించడమనేది ఇదే మొదటిసారి. అఫ్రీన్‌కు పలు ఆరోగ్య సమస్యలున్నాయి. సిజేరియన్‌ సమయంలో ఆమె రక్తపోటు 170/110 గా ఉంది. అదేవిధంగా రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగింది. దీంతో డెలివరీ జరుగుతుండగానే ఆమెకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. మొత్తానికి మూడు గంటల పాటు శ్రమించి అఫ్రీన్‌కు సుఖ ప్రసవం జరిగేలా చేశాం. పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్‌ సపోర్ట్‌ అందించాం. మిగతా ఇద్దరు పిల్లలు సొంతంగానే శ్వాస తీసుకున్నారు’ అని వైద్యుల బృందం తెలిపింది.

Also Read:

Bigg Boss Shyamala: షర్మిల పాదయాత్రలో యాంకర్‌ శ్యామల.. తాను పాదయాత్రకు మద్దతివ్వడానికి కారణం అదేనంటూ వ్యాఖ్య..

GHMC Transfer Twist: ఎల్‌బి నగర్‌ వెళ్లేందుకు విముఖత.. మళ్లీ కూకట్ పల్లిలోనే.. బదిలీలపై మళ్లీ కొత్త జీఓ..

Divorce: విడాకులకు రాజధాని హైదరాబాద్.. కొద్దిపాటి మనస్పర్థలకే విడిపోతున్న జంటలు.. దూరమవుతున్న ప్రేమానురాగాలు!