Tanker Accident: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..గొయ్యిలో కూరుకుపోయిన ట్యాంకర్..ఎక్కడంటే?

ఎటు చూసినా వరద నీటితో రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. చాలా చోట్ల లోతట్టు కాలనీలు, సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. మరోవైపు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్ లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆక‌స్మాత్తుగా కుంగ‌డంతో అటువైపుగా వెపుగా వ‌స్తున్న వాట‌ర్ ట్యాంక‌ర్ అందులో కూరుకుపోయింది. విరంచి ఆసుపత్రికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది.

Tanker Accident: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..గొయ్యిలో కూరుకుపోయిన ట్యాంకర్..ఎక్కడంటే?
Road Collapses

Updated on: Aug 05, 2025 | 3:19 PM

ఆగస్టు4 సోమవారం సాయత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరం నలువైపులా కుండపోత వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం మొత్తం తడిచి ముద్దైంది. ఇక గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్‌తో నగర ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఎటు చూసినా వరద నీటితో రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. చాలా చోట్ల లోతట్టు కాలనీలు, సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. మరోవైపు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్ లో రోడ్డు కుంగిపోయింది. విరంచి ఆసుపత్రికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది.

బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబ‌ర్ 1లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆక‌స్మాత్తుగా కుంగ‌డంతో అటువైపుగా వెపుగా వ‌స్తున్న వాట‌ర్ ట్యాంక‌ర్ అందులో కూరుకుపోయింది. అదృష్టవశాత్తు వాట‌ర్ ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు క్లీన‌ర్‌కు తీవ్ర గాయాల‌తో బయటపడ్డారు. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ట్యాంకర్ ను బయటకు తీశారు జీహెచ్ఎంసీ అధికారులు. రహదారి కుంగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.