Hyderabad: ముప్ఫై ఏళ్లకే హైబీపీ, షుగర్.. ఆందోళన కలిగిస్తున్న సర్వే ఫలితాలు

|

May 09, 2022 | 6:01 PM

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నట్లే.. ప్రజల జీవన విధానం మారిపోతోంది. టెక్నాలజీని అధికంగా వినియోగించడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలతో చిత్రవిచిత్రమైన జబ్బుల బారిన పడుతున్నారు.....

Hyderabad: ముప్ఫై ఏళ్లకే హైబీపీ, షుగర్.. ఆందోళన కలిగిస్తున్న సర్వే ఫలితాలు
High Bp
Follow us on

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నట్లే.. ప్రజల జీవన విధానం మారిపోతోంది. టెక్నాలజీని అధికంగా వినియోగించడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలతో చిత్రవిచిత్రమైన జబ్బుల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే అసాంక్రమిక వ్యాధులకు గురవుతున్నారు. ముప్పై ఏళ్లు పైపడిన వారిలో హై బీపీ, షుగర్ వంటివి పంజా విసురుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే రోగాలు.. ప్రస్తుతం ముప్ఫై ఏళ్లకే వస్తున్నాయని ఆందోళ చెందుతున్నారు. కరోనా తొలి విడత విజృంభణ తర్వాత 2020 సెప్టెంబరు 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాన్‌ కమ్యూనికేటివ్‌ డిసీజ్‌స్‌ సర్వే పేరిట ఇంటింటికీ వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ముప్పై ఏళ్ల వయసు దాటిన వారిలో బీపీ, షుగర్, ఎత్తు, బరువు ఇలా అన్ని అంశాలు సరిచూసేందుకు పరికరాలను సమకూర్చారు. ఇటీవల ఆ సర్వేకు సంబంధించిన ఫలితాలు వెల్లడించగా.. అధిక సంఖ్యలో జంట జబ్బుల బాధితులు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. క్యాన్సర్‌ బాధితులను సైతం ఈ సర్వేలో గుర్తిస్తున్నారు.

కొవిడ్ అనంతర పరిస్థితులతో చాలా మందిలో షుగర్ వ్యాధి బయటపడుతోంది. రోజుకు వంద మంది వస్తే అందులో 40 శాతం బాధితులు 30 నుంచి 40 ఏళ్లలోపు వారు ఉండడం గమనార్హం. సరైన ఆహార అలవాట్లు, వ్యాయామంతో నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని హైదరాబాదా్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇదీచదవండి

IndiGo: చిన్నారిపై ఇండిగో కాఠిన్యం.. దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కనివ్వని సిబ్బంది