హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని గోల్డెన్ జిమ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధిక వ్యాయామం చేయడంతో ఛాతినొప్పితో ఆదిత్య అనే యువకుడు కుప్పకూలిపోయాడు. జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లెట్ ఇచ్చారు. టాబ్లెట్ వేసుకున్నాక అతని పరిస్థితి మరింత విషమించింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదిత్య ప్రాణాలు కోల్పోయాడు.