GHMC: జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి భారీ కార్యక్రమం

కొత్త సంవత్సరం వస్తున్న వేళ జీహెచ్ఎంసీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెగా శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దోమల వ్యాప్తిని అరికట్టడం, డెంగ్యూ కేసులను నివారించేందుకు శానిటేషన్ డ్రైవ్ చేపట్టనుంది. మరిన్ని వివరాలు..

GHMC: జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి భారీ కార్యక్రమం
Hyderabad

Updated on: Dec 28, 2025 | 9:25 PM

జీహెచ్‌ఎంసీ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ను సుందర నగరంగా మార్చేందుకు భారీ పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే మెగా శానిటేషన్ డ్రైవ్. డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 31 వరకు నెల రోజుల పాటు ఈ డ్రైవ్ జరగనుంది. హైదరాబాద్‌లో దాదాపు కోటి మందికిపై ప్రజలు జీవిస్తున్నారు. ప్రజలు 24 గంటలు రోడ్లపై విహరిస్తూ ఉంటారు. దీంతో రోడ్లపై చెత్తాచెదారం ఎక్కువగా ఉంటుంది. నూతన సంవత్సరం వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమం చేపట్టడం గమనార్హం.

మెగా శానిటేషన్ కార్యక్రమం

హైదరాబాద్‌లో వార్డుల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అది చేపట్టిన తర్వాత చేపడుతున్న మొదటి పెద్ద కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజు 300 వార్డుల్లో పారిశుద్ద పనులు చేపట్టనున్నారు. వార్డుల్లో ఎప్పటినుంచో పేరుకుపోయిన చెత్తను దీని ద్వారా తొలగించనున్నారు. అలాగే భవనాలు, ఇళ్లు కూల్చివేతలు చేపట్టిన సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించనున్నారు. ఇక పార్కులు, పుట్‌పాత్‌లపై ఉన్న చెత్తాచెదారాలను కూడా శుభ్రం చేయనున్నారు. ప్రజలు తరచుగా చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, అక్కడ చెత్త వేయకుండా మొక్కలు నాటడం, గోడలకు రంగులు వంటి పనులను చేపట్టనున్నారు.

మెట్రో పిల్లర్ల వద్ద క్లీనింగ్

ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల మధ్య కూడా క్లీనింగ్ పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఇక రోడ్లపై చెత్తచెదారం వేయడం వల్ల దోమల వ్యాప్తి చెందుతున్నారు. దీని వల్ల ప్రలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో పాటు నగరాన్ని సుదరంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపడుతోంది.