
చాలా మంది కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. కానీ అవి కొన్ని సార్లు వాళ్లపైనే దాడి చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషప్ పరిధిలో చోటు చేసుకుంది. పవన్ కుమార్ అనే వ్యక్తిని అతని పెంపుడు కుక్క కరిచి చంపేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్‌లో నివాసం ఉంటున్న పవన్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు . అయితే అతని దగ్గర ఒక పెంపుడు కుక్క ఉంది. ఇటీవల ఆ పెంపుడు కుక్క పవన్ కుమార్‌పై దాడి చేసి, అతని శరీర భాగాలను తిన్నట్టు తెలుస్తోంది. ఈ కుక్క దాడిలో తీవ్ర గాయాలైన పవన్ కుమార్ అక్కడికక్కడే మరణించినట్టు అతని స్నేహితుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే పవన్ కుమార్ స్నేహితుడు సందీప్ అతన్ని కలిసేందుకు ఇంటికి వచ్చాడు. డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తలుపు తట్టాడు. ఎంత పిలిచినా పవన్ కుమార్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనమానం వచ్చిన సందీప్.. డోర్‌ను పగలగొట్టి లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ కర్తపు మడుగులో పడిఉన్న పవన్ కుమార్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఆ పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. దాని నోటికి మొత్తం రక్తం అంటుకొని ఉంది. పవన్ ఒంటి పై గాయాలు, కుక్క నోటికి రక్తం ఉండటంతో ఆ కుక్క కరవడం వల్లే పవన్ చనిపోయాడని అనుమానం వ్యక్తం చేశాడు సందీప్. వెంటనే మధురానగర్ పోలీసులుకు ఫిర్యాదుతో చేశాడు. సందీప్ ఫిర్యాదుతో ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తర్వాత పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
ఓ ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం చేస్తున్న పవన్ కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ చనిపోయిన సమయంలో ఇంట్లో పెంపుడు కుక్క మాత్రమే ఉన్నట్టు పవన్ స్నేహితుడు సందీప్ పోలీసులకు తెలిపారు. దీంతో కుక్క దాడిలోని పవన్ మరణించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..