సమాజంలో జరుగుతోన్న సంఘటనలు మానవత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మారుతోన్న కాలంతో అభివృద్ధి చెందుతున్నామని సంతోషించాలా.? మానవ విలువలు తగ్గిపోతున్నాయాని బాధపడదామా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చేస్తున్నాయి. పరాయి వ్యక్తులతో పెట్టుకుంటున్న సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన బైభజరంగ్ (32) స్థానికంగా కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో జీవితం సంతోషంగా సాగుతోంది. అయితే ఇదే సమయంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఏడు రోజుల క్రితం భార్య ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలిపెట్టి మరో వ్యక్తితో వెళ్లి పోయింది. భార్య కోసం వారం రోజులుగా ఎంతగానో వెతికిన భర్త.. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో గురువారం రాత్రి సొంతూరుకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
ఆయనతో పాటు కొందరు బంధువులు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అదే సమయంలో బంధువులు టికెట్ తీసుకొచ్చేందుకు వెళ్లగా రెండో నంబరు ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరి వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయిందన్న అవమానాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..