Telangana: నిరుద్యోగులు..బ్యాక్ డోర్ జాబ్‌లతో జర జాగ్రత్త..లేకుంటే మీరు కూడా ఇలానే.. !
100 మంది నిరుద్యోగులకు ఓకే ఆఫర్ లెటర్ ఇచ్చి నిరుద్యోగులను ఓ కేటుగాడు మోసం చేశాడు. జాబ్ ఇప్పిస్తానని లక్షలు రూపాయలను బాధితుల నుంచి వసూలు చేశాడు. తీరా డబ్బులు తీసుకున్న తర్వాత నిరుద్యోగులకు టోపీ పెట్టాడు.
హైదరాబాదులో నిరుద్యోగులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు ఓ కేటుగాడు దోచుకున్నాడు. నకీ లీ జాబ్ ఆఫర్ లేటర్లు సృష్టించి చల్లా శ్రీరామ్ కిరణ్ అనే వ్యక్తి, అనేకమంది ఉద్యోగ ఆశావహులను మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీస్‌లు అరెస్టు చేశారు. సుమారు 100 మంది నిరుద్యోగులను మోసం చేసి, రూ. 1 కోటి వసూలు చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు తప్పుడు ఉద్యోగ ఆఫర్ లేఖలను ఇచ్చాడు. చాలామంది తమ ఆఫర్లు కంపెనీలు తిరస్కరించినప్పుడు మోసపోయామని తెలుసుకున్నారు. కంపెనీలకు సంబంధించిన మేనేజర్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్నానని, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఒక అభ్యర్థి ఐటీ కారిడార్‌లో ఒక సంస్థను సందర్శించి ఆఫర్ లేఖ తప్పుడు అని తెలుసుకున్నాడు.
శ్రీరామ్ కిరణ్‌తో పాటు అతడు భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. గూగుల్ నుండి డౌన్లోడ్ చేసిన నకిలీ జాబ్ లెటర్‌ను ఎడిటింగ్ చేసి అదే ఆఫర్ లెటర్ మీద పేర్లు మార్చి నిరుద్యోగులకు పంపించారు. పలువురు నిరుద్యోగులు వాటినే నిజమనుకున్నారు. కొందరు 5 లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు కూడా చెల్లించిన నిరుద్యోగులు ఉన్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేటుగాడిని పట్టుకొని విచారిస్తున్నారు.