మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరని చెబుబుతుంటారు. రెప్పపాటు వేగంలోనే మరణం పలకరిస్తుంటుంది. అసలు ఊహకు కూడా అందని విధంగా ప్రాణాలు పోతుంటాయి. తాజాగా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్‌పై ఇలాంటి ప్రమాదమే జరిగింది. సరాదాగా భోజనం చేద్దామని దాబాకు బయలు దేరిన ఓ కుటుంబంలో విషాధం నిండింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ టైర్ ఆరేళ్ల చిన్నారిని బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో ముత్తంగి దాబాలో భోజనం చేద్దామని బయలు దేరారు. ఇందులో భాగంగానే సుల్తాన్‌పూర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి కాసేపు ప్రయణించారు. అయితే సందీప్ రెడ్డి కుమారుడు మోక్షిత్ రెడ్డి (6) కాసేపటికే మూత్ర విసర్జన కోసం అడగ్గా కారును రోడ్డు పక్కన ఆపారు. అనంతరం బాలుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలోనే ఎక్కడి నుంచో ఓ టైర్ అత్యంత వేగంగా దూసుకొచ్చింది.
అంతలోనే ఆ బాలుడిని ఒక్కసారిగా బాలుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమాంతం దూరంగా పడ్డాడు మోక్షిత్. తీవ్ర గాయాలైన మోక్షిత్‌ను తల్లిద్రండులు వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో మరో ఆసుపత్రికి బాలుడిని తీసుకెళ్లాలని వైద్యుడు సూచించాడు. దీంతో హుటాహుటిన మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు. అయితే తీవ్ర గాయం కారణంగా బాలుడు చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. అయితే ఆ టైర్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఓఆర్‌ఆర్‌పై ఏదైనా వాహనం టైర్ ఊడిపోయి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..