Hyderabad: బలవంతంగా ఫోన్‌ లాక్కున్న ఇంటి యజమాని.. తిరిగి ఇవ్వాలని కోరిన పాపానికి ఓ ప్రాణం బలి!

మయన్మార్​కు చెందిన ఇబ్రహీం (28) 2017లో హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు వలస వచ్చాడు. ఇబ్రహీంకు భార్య నస్మీన్​ బేగం, 2 నెలల కూతురు ఉన్నారు. అతను స్క్రాబ్​వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మొదట్లో బాలాపూర్‌లోని వాదియే సలామ్​కు చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి​ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఇటీవలే ఇబ్రహీం మరో చోటుకు మకాం మార్చాడు. మూడు రోజుల క్రితం ఆసిఫ్​అనే వ్యక్తి అప్పట్లో తన ఇంట్లో అద్దెకు ఉన్న ఇబ్రహీం వద్దకు వచ్చాడు..

Hyderabad: బలవంతంగా ఫోన్‌ లాక్కున్న ఇంటి యజమాని.. తిరిగి ఇవ్వాలని కోరిన పాపానికి ఓ ప్రాణం బలి!
Man Murdered In Hyderabad

Edited By: Srilakshmi C

Updated on: Jan 29, 2024 | 9:47 AM

హైదరాబాద్‌, జనవరి 29: లాక్కున్న సెల్​ఫోన్ తిరిగి​ఇవ్వాలని అడిగిన పాపానికి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఈ దారుణ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధి బాలాపూర్​ పోలీస్​స్టేషన్​పరిధిలో తీవ్ర కలకలం సృష్టించింది. బాలాపూర్​ఇన్​స్పెక్టర్​వెంకట్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…

మయన్మార్​కు చెందిన ఇబ్రహీం (28) 2017లో హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు వలస వచ్చాడు. ఇబ్రహీంకు భార్య నస్మీన్​ బేగం, 2 నెలల కూతురు ఉన్నారు. అతను స్క్రాబ్​వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మొదట్లో బాలాపూర్‌లోని వాదియే సలామ్​కు చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి​ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఇటీవలే ఇబ్రహీం మరో చోటుకు మకాం మార్చాడు. మూడు రోజుల క్రితం ఆసిఫ్​అనే వ్యక్తి అప్పట్లో తన ఇంట్లో అద్దెకు ఉన్న ఇబ్రహీం వద్దకు వచ్చాడు. అతని వద్ద నుంచి సెల్​ఫోన్‌ను లాక్కున్నాడు. సెల్​ఫోన్​లాక్కోవడంతో పాటు ఇబ్రహీంను ఆసిఫ్​డబ్బులు డిమాండ్​చేయడం మొదలుపెట్టాడు. నేను డబ్బులు ఇవ్వను… నా సెల్​ఫోన్​నాకు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆసిఫ్, మరో స్నేహితుడు ఖయ్యూం తో కలిసి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇబ్రహీం ఇంటి ముందే అతనిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మహేశ్వరం డివిజన్ ఏసీపీ శ్రీనివాస్, బాలాపూర్​ఇన్​స్పెక్టర్ వెంకట్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇబ్రహీం ఆదివారం సాయంత్రం 6 గంటలకు మృతి చెందాడు. అతని భార్య నస్మీన్​ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్​ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ఆసిఫ్​ ప్రస్తుతం ఆసిఫ్​నగర్‌లో ఉంటున్నారని, అతను 2022 లో ఓ హత్య కేసులో నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. ఇబ్రహీంను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల కోసం పోలీస్‌ స్పెషల్​టీంను ఏర్పాటు చేశారు. నిందితుల ఆచూకీ కనిపెట్టడం కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.