Hyderabad: చంచల్‌గూడ జైల్లో 100 మందికి పైగా ఆ పేట వారే.. కారణం ఏంటో తెలుసా..?

| Edited By: Shaik Madar Saheb

Oct 01, 2024 | 8:19 PM

గత కొన్ని రోజులుగా ఆపరేషన్ దూల్పేట్ పేరుతో గంజాయిని పూర్తిగా నివారించేందుకు ఎక్సైజ్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా దూల్పేట్ ప్రాంతాల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ దూల్పేట్ విజయవంతమైంది.

Hyderabad: చంచల్‌గూడ జైల్లో 100 మందికి పైగా ఆ పేట వారే.. కారణం ఏంటో తెలుసా..?
Chanchalguda Jail
Follow us on

గత కొన్ని రోజులుగా ఆపరేషన్ దూల్పేట్ పేరుతో గంజాయిని పూర్తిగా నివారించేందుకు ఎక్సైజ్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా దూల్పేట్ ప్రాంతాల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ దూల్పేట్ విజయవంతమైంది. గతంలో గుడుంబా కేంద్రంగా జీవనాన్ని కొనసాగించిన దూల్పేట్ వాసులు.. క్రమక్రమంగా గుడుంబాను మరచి గంజాయి వైపు వెళ్లారు. ఇక గంజాయిని సైతం నివారించేందుకు పోలీసులు కఠిన ప్రయత్నాలు చేయడంతో.. ఇది కూడా సక్సెస్ వైపు పయనిస్తోంది.. ఇప్పుడు గంజాయి అంటేనే భయపడతున్నారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ.. ఇప్పటికీ.. చాలా మంది గంజాయ్ తో పట్టుబడుతుండటంతో పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు.

గడిచిన రెండు నెలల వ్యవధిలో 43 కేసులు నమోదు చేయగా 134 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మరో 51 మంది ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చంచలగూడ జైల్లో స్పెషల్ బరాక్ లో వీరిని ఉంచారు. ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు చేపట్టిన చర్యలకు దాదాపు గంజాయిని దూల్పేట్ లో అరికట్టగలిగారు. అయితే పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా పట్టు పడకుండా కొంతమంది గంజాయి డాన్ లు మాత్రం ఇంకా అండర్ గ్రౌండ్ లోనే మగ్గుతున్నారు.

కొద్దిరోజుల క్రితం దూల్పేట్ గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సంధ్యా భాయ్ ని సైతం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కూతురు కుమారుడు పైన ఎక్సైజ్ పోలీసుల కేసులు నమోదు చేయగా.. వారు పోలీసుల చేర నుంచి తప్పించుకున్నారు. వారి కోసం ఎక్సైజ్ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.

దూల్పేట్ లో కుటుంబ సమేతంగా గంజాయిని విక్రయించే వారు అధికంగా ఉన్నారు. దీంతో కుటుంబంలోని ఒకరు దొరకగానే మిగిలిన వారు యథేచ్చగా పారిపోయేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు.

ఇక తాజాగా చంచల్ కూడా జైల్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య అధికమవుతుంది. జైలలో వీరికి గంజాయి దొరకకపోవడంతో వింత వింతగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. అందులోనూ గంజాయి విక్రయతలందరినీ ఒకే బరాక్ లో ఉంచడంతో వీరి ఆందోళన మిన్నoటిoది. పోలీసుల నుండి తప్పించుకు తిరుగుతున్న మరికొంతమంది విక్రయితుల కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..