Hyderabad: మరికొద్ది గంటల్లో పరేడ్ గ్రౌండ్ వేదికగా విమోచన దినోత్సవ వేడుకలు గ్రాండ్‌గా జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను ఘనంగా చేశారు బీజేపీ నేతలు. మూడు రాష్ట్రాలకు చెందిన సీఎంలను ఆహ్వానించారు. హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలుమురు కీలక నేతలు సైతం పాల్గొంటారు. 9.15 నిమిషాలకు పరేడ్ గౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేస్తారు అమిత్ షా. తర్వాత పటేల్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను, సీఆర్ఫీఎఫ్ సాయూధ బలగాల ప్రత్యేక ప్రదర్శనను వీక్షిస్తారు. తర్వాత విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రసంగిస్తారు అమిత్ షా. మధ్యాహ్నం తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.
పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపింది కేంద్రం. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ సిండే, కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఆహ్వానించింది. అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పరిస్థితి ప్రకారం ఎవరెవరూ వస్తారనేది ఆసక్తి నెలకొంది.
#WATCH | Telangana: Union Home Minister Amit Shah arrives in Hyderabad pic.twitter.com/ekTbAYZmgj
— ANI (@ANI) September 16, 2023
ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. ‘సంపర్క్సే సంవర్ధన్’లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ సింధుతో సమావేశమయ్యారు. పీవీ సింధు క్రీడా ప్రతిభ దేశానికే గర్వకారణం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. సింధు నిబద్ధత, కఠోర శ్రమ దేశ యువతకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. కెరీర్ లో మరింత విజయవంతం అవ్వాలంటూ అమిత్ షా.. సింధుకు ఆశీస్సులు అందించారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, సింధు తండ్రి వెంకటరమణ పాల్గొన్నారు.
“Met ace badminton player PV Sindhu today in Hyderabad. The nation takes pride in the international acclaim she has received for her exceptional sporting talent. Her commitment, hard work, and dedication are an inspiration for the younger generation”, tweets Union Home Minister… pic.twitter.com/MvBAkqIIpW
— ANI (@ANI) September 16, 2023
జూబ్లీహిల్స్‌లోని సీఆర్ఫీఎఫ్ కార్యాలయంలో.. రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు ఈ సందర్భంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంపై అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తుంది.
#WATCH | Telangana: Union Home Minister Amit Shah met badminton player PV Sindhu in Hyderabad
Union Minister & BJP Telangana chief G Kishan Reddy was also present during the meeting. pic.twitter.com/BGfHB2q034
— ANI (@ANI) September 16, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..