Hyderabad: రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు..!
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో సోమవారం (జూలై 20) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్ టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూకట్‌పట్టి హౌజింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం వృద్ధుడు రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ ఆటో ఢీకొనడంతో నర్సింహ (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో సోమవారం (జూలై 20) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్ టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూకట్‌పట్టి హౌజింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం వృద్ధుడు రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ ఆటో ఢీకొనడంతో నర్సింహ (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఘటన తీవ్రత వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు నర్సింహ జహీరాబాద్‌లోని శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సోమవారం ఉదయం జహీరాబాద్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ఆయన తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో ఆటో వేగంగా వచ్చి నర్సింహను ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. ప్రమాద తీవ్రతను బట్టి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రమాదానికి గల పూర్తి కారణాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అలాగే వాహనదారులు వేగ నియంత్రణ పాటించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
