AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాలకు అంతరాయం.. వివరాలివే..

సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద కొత్త ట్రైన్ ట్రాక్‌ లైన్ నిర్మిస్తోంది. అయితే, ఈ నిర్మాణ పనులకు హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ అడ్డంకిగా మారింది. దాంతో ఈ పనులు పూర్తయ్యే వరకు..

Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాలకు అంతరాయం.. వివరాలివే..
Drinking Water Supply Connection
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2023 | 9:19 PM

Share

సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద కొత్త ట్రైన్ ట్రాక్‌ లైన్ నిర్మిస్తోంది. అయితే, ఈ నిర్మాణ పనులకు హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ అడ్డంకిగా మారింది. దాంతో ఈ పనులు పూర్తయ్యే వరకు ఆ పైప్‌లైన్‌ను పక్కకు మార్చాల్సి వస్తోంది. ఈ కారణంగా హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాలకు కొంతకాలం నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు.

రైల్వే లైన్‌ నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా హైదరాబాద్‌కు మంచినీటిని సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లో కొండపాక నుంచి ఘన్‌పూర్‌కు ఉన్న 3,000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైప్‌లైన్‌ను పక్కకు మార్చాల్సి వస్తోంది. మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు మొత్తం 66 గంటల పాటు ఈ పనులు జరుగనున్నాయి. ఈ కారణంగా కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలివే..

1. ఓ అండ్ ఎం డివిజన్ నం.12 (కుత్బుల్లాపూర్) : షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం.

2. ఓ అండ్ ఎం డివిజన్ నం.13 (మల్కాజ్ గిరి/అల్వాల్) : డిఫెన్స్ కాలనీ.

3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 19 : నాగారం/ దమ్మాయి గూడ, కీసర.

4. ఓ అండ్ ఎం డివిజన్ నం. 24 (బొల్లారం) : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ సప్లై.

5. ఓ అండ్ ఎం డివిజన్ నం. 25 (కొంపల్లి) : కొంపల్లి, గొండ్ల పోచంపల్లి ప్రాంతాలు.

6. ఆర్ డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలు : కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.

7. ఓ అండ్ ఎం డివిజన్ నం. 14 (ఉప్పల్) : కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.

పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్. ఆర్. నగర్) : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.

2. ఓ అండ్ ఎం డివిజన్ నం. 9 (కూకట్ పల్లి) : కేపీహెచ్ బీ, మల్యాసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు.

3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 15 (శేరిలింగం పల్లి) : లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు.

4. ఓ అండ్ ఎం డివిజన్ నం. 23 ( నిజాంపేట్) : ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుపల్లి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!