
హైదరాబాద్ మహానగరంలో హృదయవిదారక ఘటన ఒక టి వెలుగులోకి వచ్చింది. శివారు ప్రాంతం బోడుప్పల్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ముగ్గురు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన పి. సురేందర్‌రెడ్డి, ఆయన భార్య విజయ, కూతురు చేతన రెడ్డి హరితహారం కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ముగ్గురు కుటుంబసభ్యులు శనివారం (జనవరి 31) ఉదయం చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిద్రమైన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..