Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

పెరుగుతన్న టెక్నాలజీని వాడుకొని కొందరు అద్భుతాలు సృష్టింస్తుంటే.. మరి కొందరు వ్యక్తులు అదే టెక్నాలజీని వాడి దొంగతనాలు దోపిడీకి పాల్పడతున్నారు. తాజాగా అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. దొంగతనం ఎలా చేయాలో గూగుల్‌ సెర్చ్‌ చేసి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు కొందరు కేటుగాళ్లు చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి స్టేషన్‌ మెట్లు ఎక్కారు.

Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?
Hyderabad Temple Theft

Updated on: Jan 15, 2026 | 9:18 AM

దొంగతనం ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి కొందరు దుండగులు ఆలయంలో చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్థరాత్రి గుడిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు… వాళ్ల నుంచి రూ.26 లక్షల బంగారం, వెండి ఆభరణాలతో పాటు, రెండు బైక్స్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం.. కూకట్ పల్లీలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం క్రితం దొంగతనం జరిగింది. ఈ దొంగతాన్ని పాల్పడిన కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య, ఎం.మల్లికార్జున్, బాష్య వెంకట మోహిత్‌కుమార్, దున్నపోతుల పవన్‌ కల్యాణ్, దండి అనిల్‌ తేజ, కంభపు విజయ్, తంగిళ మణికంఠ దుర్గాప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించిగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఏదైనా ఆలయంలో చోరీ ఎలా చేయాలని గూగుల్‌లో వెతికి ఈ చోరి పాల్పడినట్టు నిందితులు తెలిపారు. ప్లాన్ ప్రకారం వీరు ఈనెల 7వ తేదీ అర్థరాత్రి సర్దార్‌పటేల్‌నగర్‌లోని వేంకటశ్వేరస్వామి ఆలయంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలను అపహరించి సూట్‌కేసులో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆలయ పూజారి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి రూ.26 లక్షల ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరినీ రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.