Hyderabad: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య!

హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో దారుణం వెలుగు చూసింది. ఫాంహౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురయ్యారు. వికారాబాద్‌ నుంచి తీసుకొచ్చి ఇద్దరి ఫామ్‌హౌస్‌లో హత్య చేసినట్టు తెలుస్తోంది. మహిళలు కనిపించడంలేదని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళల దారుణ హత్య!
Moinabad Farmhouse Murder

Updated on: May 16, 2026 | 3:57 PM

డబ్బులు ఇస్తామని చెప్పి ఫామ్‌హౌస్‌కు రప్పించి ఇద్దరు మహిళలను అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఫైనాన్స్‌ డబ్బులు ఇస్తామని చెప్పి మొయినాబాద్‌లోని ఫామ్‌మౌస్‌కు పిలిచి అక్కడే అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే మహిళలు కనిపించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళకోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో మహిళలు ఇద్దరూ మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో హత్యకు గురైనట్టు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ఫైనాన్స్ డబ్బుల వ్యవహారంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us