Hyderabad: కళ్లల్లో కైపు.. చూపుల్లో వలపు.. పబ్ డ్యాన్సర్ కవ్వింపులకు క్లీన్‌బౌల్డ్‌.. తీరా చూస్తే..!

కళ్లల్లో కైపు...చూపుల్లో వలపు. అమ్మాయి విసిరిన వలపు బాణాలకు ఎంతటి వారైనా.. క్లీన్‌ బౌల్డ్‌ అవ్వాల్సిందే..! ఎంతవారు కానీ కాంతదాసులే అన్నట్లు.. యువతి చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. ఆ తర్వాత కథ బెడ్‌రూమ్‌ దాకా వెళ్లింది. హనీట్రాప్‌లో పడ్డ ఓ యువకుడు అమ్మడి మనీట్రాప్‌లో చిక్కి విలవిల్లాడాడు. హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిందీ యవ్వారం.

Hyderabad: కళ్లల్లో కైపు.. చూపుల్లో వలపు.. పబ్ డ్యాన్సర్ కవ్వింపులకు క్లీన్‌బౌల్డ్‌.. తీరా చూస్తే..!
Honey Trapped Case

Updated on: Aug 01, 2025 | 11:09 AM

కళ్లల్లో కైపు…చూపుల్లో వలపు. అమ్మాయి విసిరిన వలపు బాణాలకు ఎంతటి వారైనా.. క్లీన్‌ బౌల్డ్‌ అవ్వాల్సిందే..! ఎంతవారు కానీ కాంతదాసులే అన్నట్లు.. యువతి చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. ఆ తర్వాత కథ బెడ్‌రూమ్‌ దాకా వెళ్లింది. హనీట్రాప్‌లో పడ్డ ఓ యువకుడు అమ్మడి మనీట్రాప్‌లో చిక్కి విలవిల్లాడాడు. మత్తు వదిలి మామూలు అయ్యాక, వలపు వల వదిలించుకోవడానికి నానా తంటాలు పడ్డాడు..

హైదరాబాద్‌ మహానగరంలో మరో హనీ ట్రాప్ వ్యవహారం బయటపడింది. బంజారాహిల్స్ పరిధిలోని ఒక బార్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్.. బార్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షిస్తూ.. హనీట్రాప్‌లో దించుతోంది. తన భర్తతో కలిసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు దండుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ యువకుడు పబ్‌కు వచ్చాడు. అతడిని ట్రాప్ చేసిన డింపుల్ యాదవ్, ఆమె భర్త పవన్.. మత్తులో దించారు. నిద్ర మాత్రల ఇచ్చి అశ్లీల వీడియోలు రికార్డ్ చేశారు.

ఫేక్ రిపోర్టర్, ఫేక్ టాస్క్‌ఫోర్స్ పోలీసు ముసుగులో బాధితుడిని ట్రాప్ చేశారు. బార్ డ్యాన్సర్ డింపుల్ యాదవ్ తోపాటు ఆమె భర్త పవన్, పలువురు బౌన్సర్లు మాయ మాటలతో మోసం చేశారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే అశ్లీల వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు తాళలేక సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ యవ్వారం బయటకు వచ్చింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..