Telangana: ‘కిక్’ సినిమాను మించిన చోరీ.. దొంగ వివరాలు విస్తే బిత్తరపోవడం ఖాయం..!

|

Jul 07, 2022 | 6:00 AM

Hyderabad: మీరు ‘కిక్’ సినిమా చూశారా? అందులో హీరోకు ఏ పనిలోనూ కిక్ రాక.. జాయిన్ అయిన ప్రతీ పనిని త్వరగా మానేస్తుంటాడు.

Telangana: ‘కిక్’ సినిమాను మించిన చోరీ.. దొంగ వివరాలు విస్తే బిత్తరపోవడం ఖాయం..!
Arrest
Follow us on

Hyderabad: మీరు ‘కిక్’ సినిమా చూశారా? అందులో హీరోకు ఏ పనిలోనూ కిక్ రాక.. జాయిన్ అయిన ప్రతీ పనిని త్వరగా మానేస్తుంటాడు. సూపర్ టాలెంట్ ఉండి కూడా.. ఎందులోనూ కుదురుగా ఉండదు. అదేంటంటే కిక్కు లేదని చెబుతారు. చివరకు దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. అలా దొంగిలించిన సొమ్మును పేదలకు, అనాథలకు, చిన్నారుల వైద్యానికి ఖర్చు చేస్తుంటాడు. అందులో కిక్కు ఉందని ఫిక్స్ అయితే.. చోరీలను అలవాటుగా మార్చేసుకుంటాడు. అయితే, అచ్చం అలాంటి వ్యక్తే రియల్ లైఫ్ లోనూ ఉన్నాడు. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆ ఘనాపాటి.. చేసేది మాత్రం దొంగతనాలు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 200 చోరీలు చేసి పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ వింత క్యాండిడేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన వంశీకృష్ణ ఎంబీఏ చదివాడు. మామూలు చదువు కాదండోయ్.. గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే, ఉద్యోగం చేయడం ఇష్టం లేక డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించడం మొదలు పెట్టాడు. దాంతో అందరూ అతన్ని ఇండిపెండింట్ భావాలు కలిగిన వ్యక్తి అనుకుని, మంచివాడిగా భావించారు. అయితే, డ్రైవింగ్ చేస్తూనే.. తన వక్రబుద్ధిని ప్రదర్శించడం మొదలు పెట్టాడు వంశీకృష్ణ. డ్రైవింగ్ చేస్తూ జల్సాలకు అలవాటు పడిన వంశీకృష్ణ.. సులభ మార్గంలో డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు దొంగతనాలే కరెక్ట్ అని పిక్స్ అయ్యాడు. ఇంకేముంది.. వరుస దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయడం మొదలుపెట్టాడు.

తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు వంశీకృష్ణ. 2006 నుంచి ఇప్పటివరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. అయితే, రెండు వందల చోరీలు చేసిన వంశీకృష్ణ.. పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా.. అతను తన బుద్ధి మార్చుకోకపోగా.. చోరీలు ఎక్కువ చేయసాగాడు. దొంగతనాలు చేస్తూ పట్టుబడడం.. జైలుకు వెళ్లి రావడం.. తిరిగి కొనసాగించడం.. ఇదే పద్ధతి కొనసాగిస్తున్నాడు నిందితుడు వంశీకృష్ణ. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అంతేకాదు ఇతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేశారు.

అయితే, తాజాగా మరో కేసులో హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీసులకు చిక్కాడు వంశీకృష్ణ. ఇతనికి సంబంధించిన వివరాలన్నీ.. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తెలిపారు. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణకు పలు మారుపేర్లు ఉన్నాయని చెప్పారు. లోకేశ్‌, సామ్‌ రిచర్డ్‌ పేరుతో.. నగరంలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో వంశీకృష్ణను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..