భూకబ్జా కుంభకోణంలో ఈ నెల మొదట్లో అరెస్టయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వర్ రావుపై అలియాస్ కన్నారావుపై హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు తేజేశ్వర్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
తనను గెస్ట్ హౌజ్‌లో బంధించి దాడి చేశారన్న టెక్కీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బంధువులతో ఏర్పడ్డ భూవివాద పరిష్కారం కోసం కన్నరావును సంప్రదించినట్లు టెక్కీ విజయ్ వర్ధన్‌రావు పోలీసులకు తెలిపాడు. తన వద్ద నగదు, బంగారం ఉందని బిందు మాధురి అలియాస్ నందిని ద్వారా తెలుసుకున్న కన్నా రావుతో పాటు నందిని తదితరులు అతన్ని అతిథి గృహంలో నిర్బంధించి నగదు, బంగారం దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్, దోపిడీ, క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా భూకబ్జా ఆరోపణలపై ఏప్రిల్ 2న ఆదిబట్ల పోలీసులు కన్నరావును అరెస్టు చేసిన విషయం విధితమే. భూవివాదానికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో కన్నారావుతోపాటు పాటు మరో 37 మందిపై గత నెలలో కేసు నమోదైంది.
మన్నెగూడలో రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావుతో పాటు తదితరులు యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. నిందితులు రెండెకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని బండోజు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కన్నారావు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించడంతో, పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..