వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌ అవుతున్నాయా..? అసలు నిజం బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు..!

హైదరాబాద్ నగర పోలీస్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక తప్పుడు వార్తపై పౌరులను హెచ్చరించింది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. తప్పుడు వార్తల నమ్మి భయాందోళనలకు గురి కావద్దని నగర పోలీసులు సూచిస్తున్నారు.

వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌ అవుతున్నాయా..? అసలు నిజం బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు..!
Untitled 1 Copy

Edited By:

Updated on: Jun 03, 2026 | 2:36 PM

హైదరాబాద్ నగర పోలీస్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక తప్పుడు వార్తపై పౌరులను హెచ్చరించింది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. తప్పుడు వార్తల నమ్మి భయాందోళనలకు గురి కావద్దని నగర పోలీసులు సూచిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక సందేశం చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను అమలు చేస్తోందని, దీనివల్ల మీ వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతాయని, సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షించబడతాయని ఆ పోస్టు సారాంశం. అయితే, ఇది కేవలం ఆకతాయిలు సృష్టించిన తప్పుడు ప్రచారం మాత్రమేనని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ పోలీసులు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు:

ప్రజలను భయపెట్టడమే లక్ష్యం: సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఫేక్ న్యూస్‌ను సృష్టిస్తున్నారు. గతంలోనే హెచ్చరించాం: ఈ తరహా వార్తలు గతంలోనూ వచ్చాయని, అప్పుడే వీటిని ఖండించామని పోలీసులు గుర్తు చేశారు. చట్టపరమైన చర్యలు: తప్పుడు వార్తలను సృష్టించే వారిపై, వాటిని బాధ్యతారాహిత్యంగా ఫార్వార్డ్ చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ పద్ధతిలో పనిచేస్తాయి. అంటే సందేశాలు పంపే వారికి, అందుకునే వారికి తప్ప మూడో వ్యక్తికి గానీ, ప్రభుత్వానికి లేదా కంపెనీకి కూడా వాటిని చూసే అధికారం ఉండదు. అందుచేత బాధ్యతగల పౌరులుగా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేని వార్తలను నమ్మకండి. ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసే ముందు దాని వాస్తవికతను సరిచూసుకోండి. భయం కలిగించే వార్తలను ఇతరులకు షేర్ చేసి వారిని ఆందోళనకు గురి చేయకండి. మీకు ఏదైనా అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us