నాలుగేళ్ల చిన్నారిపై DAV పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యంతో సీరియస్ యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. DAV స్కూల్ గుర్తింపును రద్దుచేసింది. జరిగింది చిన్న సంఘటన కాదు. అత్యంత దారుణమైనది. ఏ తల్లిదండ్రులైనా భరించలేనిదే. కానీ, స్కూల్ మూసివేతతో మిగతా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందనేది మిగతా స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఆవేదన. ఇదే వాదనను ప్రభుత్వానికి వినిపించారు తల్లిదండ్రులు. స్కూల్ రీఓపెన్ చేయాలంటూ విద్యాశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనకు వినతిపత్రాలు ఇచ్చారు తల్లిదండ్రులు.
DAV స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ పేరెంట్స్ రిక్వెస్ట్‌పై సానుకూలంగా స్పందించారు విద్యాశాఖ కమిషనర్ దేవసేన. స్కూల్ గుర్తింపు రద్దుపై పునరాలోచిస్తామంటూ హామీ ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం, అలాగే తల్లిదండ్రుల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అయితే, ఈ మొత్తం సంఘటనపై రెండ్రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని DAV స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. లోపాలను సరిచేసుకోవడానికి స్కూల్ మేనేజ్‌మెంట్ ఇచ్చే వివరణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపుతానన్నారు కమిషనర్ దేవసేన.
అకడమిక్ ఇయర్ మిడిల్‌లో ఉండటం, విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారడంతో DAV స్కూల్ రీఓపెన్‌పై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని స్కూల్‌కి మళ్లీ పర్మిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పేరెంట్స్ రిక్వెస్ట్‌కి సర్కార్ మనసు కరిగితే వారం రోజుల్లోనే రీఓపెన్ కానుంది DAV స్కూల్.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి