Hyderabad Numaish: నేటి నుంచి 81వ నుమాయిష్‌ షురూ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎగ్జిబిషన్‌ సొసైటీ

|

Jan 01, 2022 | 8:13 AM

Numaish: హైదరాబాద్‌ నగర వాసులను అలరించేందుకు 81వ నుమాయిష్‌ సిద్ధమైంది. స్టాళ్ల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది.

Hyderabad Numaish: నేటి నుంచి 81వ నుమాయిష్‌ షురూ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎగ్జిబిషన్‌ సొసైటీ
Hyderabad Numaish
Follow us on

All India Industrial Exhibition at Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులను అలరించేందుకు 81వ నుమాయిష్‌ సిద్ధమైంది. స్టాళ్ల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది. ‘నుమాయిష్’గా ప్రసిద్ధి చెందిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (ఏఐఐఈ) నేటి నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, పోలీసు శాఖ అధికారులు కోవిడ్ 19 నిబంధనలను నిర్ధారించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వివిధ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఎగ్జిబిషన్ సొసైటీకి పోలీసు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల నుంచి అనుమతులు లభించాయని సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పీ విశ్వప్రసాద్‌ తెలిపారు.అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో వాటర్‌ హైడ్రెంట్స్‌ ఏర్పాటు చేశామన్నారు. “మాస్క్ ధరించని వ్యక్తులకు రూ. 1,000 జరిమానా విధిస్తామన్నారు. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ధూమపానం చేస్తూ పట్టుబడిన వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుందన్నారు.

హైదరాబాద్‌లో 81వ నుమాయిష్‌ ఇవాళ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ నుమాయిష్‌ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించే ఈ ప్రదర్శన కోసం జీహెచ్‌ఎంసీ, ఫైర్‌, పోలీసు, విద్యుత్‌ అన్ని శాఖల అనుమతులు తీసుకున్నట్టు తెలిపింది సొసైటీ. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి స్టాళ్ల సంఖ్యను 1,600కు కుదించారు నిర్వాహకులు. పెరుగుతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్‌ భయంతో రక్షణ చర్యలను పకడ్బంధీగా చేపట్టారు పోలీసులు.

ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకశ్మీర్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల స్టాళ్లు నుమాయిష్‌లో దర్శనమివ్వనున్నాయి. అటు నుమాయిష్‌కు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.

Read Also… Tirumala: ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల కొండలు