
జూబ్లీహిల్స్‌లో బాగా డబ్బున్న వ్యక్తుల పిల్లలే లక్ష్యంగా తమ కొడుకులను రంగంలోకి దించి, వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకొని వాటితో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మీనాకుమారిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఆమెను ప్రశ్నించిన విమెన్ సేఫ్టీ పోలీసులు.. విచారణలో మైనర్లను ట్రాప్ చేసిన విధానం, బ్లాక్‌మెయిల్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో మీనాకుమారిని ఈరోజు సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు.
సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్లను బుట్టలో వేసుకున్నట్లు మీనాకుమారి కుమారులు ఆజాద్, రాజీవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. మైనర్లతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే ఆజాద్ రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలను తన తల్లి మీనాకుమారికి పంపినట్లు దర్యాప్తులో తేలింది.
ఆజాద్ నుంచి అందిన వీడియోలను ఉపయోగించి మీనాకుమారి మైనర్లను బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఆజాద్, రాజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మీనాకుమారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కస్టడీలో భాగంగా ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విమెన్ సేఫ్టీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మైనర్లను ఎలా ట్రాప్ చేశారు? ఎవరెవరిని సంప్రదించారు? బ్లాక్‌మెయిల్ ద్వారా ఎంత మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,