Hyderabad Metro: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో రైళ్లు!

హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకపై తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రయాణికులకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల అవసరాల దృష్యా 5గంటల నుంచే మెట్రోలను నడపాలని దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమారు తాజాగా తెలంగాణ సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన దీనిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad Metro: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో రైళ్లు!
Hyderabad Metro Timings

Updated on: Apr 20, 2026 | 10:21 AM

Hyderabad Metro: హైదరాబాద్‌ నగరంలో తెల్లవారుజామున 5గంటల నుంచే మెట్రో సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ తెలంగాణ సీఎస్ రామకృష్ణరావును కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రోజే అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని.. ఇలా వచ్చే రైళ్లన్ని ఉదయం 4-5 గంటల మధ్యలోనే హైదారాబాద్‌లోని కీలక స్టేషన్‌లైన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్‌ చేరుకుంటున్నాయని తెలిపారు. అంతేకాదు హైదరాబాద్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే వందేభారత్ సమా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం అదే సమయంలో బయల్దేరుతున్నాయన్నారు. ఈ సమయంలో మెట్రో సేవలు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు.

అంతేకాదు ప్రస్తుతం నాగోల్‌, మియాపూర్, ఎల్‌బీనగర్ వంటి స్టేషన్‌ల నుంచి ఉదయం 6 గంటలకే మెట్రోలు స్టార్ట్ అవుతున్నా.. అవి నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్‌లకు చేరుకునేందుకు దాదాపు అరగంటపై పైన పడుతుంది. దీంతో ఈ మెట్రోలు స్టేషన్‌లను చేరుకునేందుకు సుమారు 6:30-6:45 అవుతుందన్నారు. ఇదే విషయంపై గతంలోనూ మెట్రోరైలు లిమిటెడ్ ఎండీకి లేఖ రాశామని కానీ అప్పుడు సాంకేతిక అంశాలు, నిర్వహణ కారణాల నేపథ్యంలో మెట్రో సమయంలో మార్పులు చేయలేమని ఎల్‌అండ్‌టీ-హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తెలిపినట్టు చెప్పారు. కనీసం ఇప్పుడైనా ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి మెట్రో రైళ్లను ఉదయం 5గంటల నుంచి నడిపేలా చూడాలని జీఎం సీఎస్‌ను కోరారు.

ఇది కూడా చదవండి: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు

ఇక రైల్వే జీఎం విజ్ఞప్తిపై తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆయన హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులకు సూచించారు.

ఇది కూడా చదవండి: మీరు పడుకునే విధానమనే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us