Telangana: తెలంగాణ ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ.. ఆ రెండు రోజులు కుంభవృష్టి తప్పదంటా..

|

Jul 23, 2023 | 4:44 PM

తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. గడిచిన మూడు రోజులుగా భార్షీలు కురుస్తున్న తరుణంలో అధికారులు మరోసారి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వరుణుడు మళ్లీ దండెత్తడానికి సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం...

Telangana: తెలంగాణ ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ.. ఆ రెండు రోజులు కుంభవృష్టి తప్పదంటా..
Rainalert
Follow us on

తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. గడిచిన మూడు రోజులుగా భార్షీలు కురుస్తున్న తరుణంలో అధికారులు మరోసారి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వరుణుడు మళ్లీ దండెత్తడానికి సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఈ నెల 25,26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తెలంగాణకు వాతావారణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిని ఆవర్తనం ఆదివారం (ఈరోజు) దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం కూడా షియర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ – 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా సోమవారం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రా దగ్గర్లోని వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..