Hyderabad: ఇది ప్రేమా..! పైచాచికమా!.. కూతురు జాతకంలో కష్టాలున్నాయని కడతేర్చిన కసాయి తండ్రి.. అసలు కారణం తెలిస్తే షాక్..

|

Aug 21, 2023 | 1:43 PM

విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్‌, హిమబిందు దంపతులకు ఎనిమిదేళ్ల మోక్షజ సంతానం. వీరిద్దరూ ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవారు. పనితీరు సరిగా లేదని సదరు సంస్థ ఉద్యోగంనుంచి తొలగించింది. భార్య వల్లే ఉద్యోగం పోయిందని ఆమెపై కక్షగట్టాడు. ఇదే విషయమై భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో భార్య కూతురును తీసుకుని బీహెచ్‌ఈఎల్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. చంద్రశేఖర్‌ వారంలో రెండుసార్లు వెళ్లి కూతుర్ని చూసేవాడు.

Hyderabad: ఇది ప్రేమా..! పైచాచికమా!.. కూతురు జాతకంలో కష్టాలున్నాయని కడతేర్చిన కసాయి తండ్రి.. అసలు కారణం తెలిస్తే షాక్..
mokshagna and chandra sekhar
Follow us on

టెక్నాలజీయుగంలోనూ మనుషులు మూఢనమ్మకాలను వదలడం లేదు. అమావాస్యవేళ క్షుద్రపూజలు, నరబలులు లాంటి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూతురి జాతకం బాగాలేదని, భవిష్యత్తులో ఆమె కష్టాలు పాలవుతుందని భావించిన ఓ తండ్రి కూతురిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్‌, హిమబిందు దంపతులకు ఎనిమిదేళ్ల మోక్షజ సంతానం. వీరిద్దరూ ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవారు. పనితీరు సరిగా లేదని సదరు సంస్థ ఉద్యోగంనుంచి తొలగించింది. భార్య వల్లే ఉద్యోగం పోయిందని ఆమెపై కక్షగట్టాడు. ఇదే విషయమై భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో భార్య కూతురును తీసుకుని బీహెచ్‌ఈఎల్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. చంద్రశేఖర్‌ వారంలో రెండుసార్లు వెళ్లి కూతుర్ని చూసేవాడు. ఈ క్రమంలోనే అతను కుమార్తె జాతకం గురించి తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఆమె కష్టాలు అనుభవిస్తుందని భావించాడు. కూతురు కష్టపడొద్దని, భార్య ఒంటరిగా మారి నరకం చూడాలన్న ఆలోచనతో మోక్షజను అంతం చేయాలనుకున్నాడు.

మోక్షజను ఆగస్టు 18 సాయంత్రం తనతోపాటు కారులో తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. స్కూల్‌ ముగిసి చాలా సమయమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులు చంద్రశేఖర్‌కి ఫోన్‌ చేశారు. పాప నిద్రపోతోందని చెప్పాడు. తాము వచ్చి పాపను తీసుకెళ్తామంటే అక్కర్లేదు, తానే తెస్తానని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. మృత దేహాన్ని ఎక్కడైనా పడేద్దామని ఓఆర్‌ఆర్‌పై తారామతిపేట-కోహెడ మధ్య కారులో అటూ ఇటూ తిరుగుతూ అవకాశం కోసం చూస్తున్నాడు. అదే మార్గంలో రాత్రి పదిన్నర గంటల సమయంలో కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టి యాక్సిడెంట్‌ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఆ కారులోని వ్యక్తి క్షేమంగానే బయటపడ్డాడు. అతను అక్కడ చంద్రశేఖర్‌ను గమనించాడు. సాయం కోసం వెళ్లాడో ఏమో కానీ చంద్రశేఖర్‌ దుస్తులకు రక్తం మరకలు, కారులో చిన్నారి మృతదేహం కనిపించడంతో డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు. దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..