AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: భర్త స్నేహితుడని నమ్మితే నట్టేటా ముంచేశాడు.. ఓ యువతి ఫేస్ చేసిన విషాద గాథ ఇది..!

Hyderabad: నమ్మిన చోటే మోసపోతుంటారు. ఓ యువతి విషయంలో అదే జరిగింది. భర్త స్నేహితుడు అని నమ్మినందుకు నాయవంచనకు గురైంది. చివరికి అతని వేధింపులు తాళలేక..

Hyderabad Crime: భర్త స్నేహితుడని నమ్మితే నట్టేటా ముంచేశాడు.. ఓ యువతి ఫేస్ చేసిన విషాద గాథ ఇది..!
Arrest
Shiva Prajapati
|

Updated on: Nov 09, 2021 | 9:40 AM

Share

Hyderabad: నమ్మిన చోటే మోసపోతుంటారు. ఓ యువతి విషయంలో అదే జరిగింది. భర్త స్నేహితుడు అని నమ్మినందుకు నాయవంచనకు గురైంది. చివరికి అతని వేధింపులు తాళలేక ఆ యువతి పోలీసులని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఫీడ్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నేహితుడని నమ్మి ఇంటికి పిలిచినందుకు అతడి భార్య మీదే కన్నేశాడు ప్రశాంత్ అనే కామాంధుడు. 2019 నుంచి పలుమార్లు ఆ యువతి పై బలత్కారం చేశాడు దుర్మార్గుడు. సదరు యువతి భర్తకు స్నేహితుడైన ప్రశాంత్ తరచూ ఇంటికి వస్తూ యువతితో మాట మాట కలిపాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ చేసి తనను ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టాడు. దీంతో ఆ యువతి అతడితో మాట్లాడటం మానేసింది. నా ఫోన్ ఎత్తకుంటే నాతో మాట్లాడకుంటే సూసైడ్ చేసుకుంటానని మళ్లీ చెప్పడంతో భయపడి మాట్లాడటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2020లో తన భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చిన ఆ కామాంధుడు ప్రశాంత్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే నీ పరువే పోతుందని, మగాడిని నాకేం కాదంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.

అదే అదునుగా పలుమార్లు ఆ యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇదిలా ఉండగా మే 2021లో బాధిత మహిళ కోహెడ లో తనకున్న ప్లాట్‌ని అమ్మగా రూ.16 లక్షలు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్.. యువతి డబ్బు మీద కన్నేశాడు. మంచితనంగా నటించి, మాయమాటలు చెప్పి ఆ డబ్బు తనకు ఇస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. డబ్బు చేతిలో పడ్డాక అసలు రూపం బయటకు తీశాడు కీచకుడు. ఇదే క్రమంలో తన పిల్లలకి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి అమీర్‌పేటకు తీసుకొచ్చి అక్కడ కూడా మరోసారి బలాత్కారం చేశాడు. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో యువతి మీద పలుమార్లు బలత్కారం చేశాడు. ఇక ఎన్ని రోజులైనా డబ్బుల విషయం మాట్లాడకపోవటంతో నిలదీసి అడగటంతో బెదిరించడం మొదలుపెట్టాడు. తన దగ్గర నగ్న వీడియోలు ఉన్నాయని, తన జోలికి వస్తే ఆ వీడియోలు బయటపెడతానని డబ్బులు ఇవ్వనని చెప్పేశాడు. వాడి టార్చర్ తట్టుకోలేని యువతి.. తన తల్లి సహాయంతో పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఉన్న ప్రశాంత్‌ నుంచి రూ. 16 లక్షలు రికవరీ చేస్తామని అన్నారు.

Also read:

Changing Rules: మారుతున్న రూల్స్..ఇకపై వస్తువుల ప్యాకేజీలపై ఎమార్పీతో పాటు దానిని కూడా చెప్పాల్సిందే!

కచోరిలో ఉల్లిపాయ లేదని యువతి రచ్చ.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన అమ్మాయి.. షాకింగ్ వీడియో..

Corona Cases: ఖతర్నాక్‌గా కరోనాకు కాలుష్యం కోరలు.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్న కేసులు.. (వీడియో)